AG 89 చూడుము గెత్సెమనే
Versi Version 1
చూడుము గెత్సెమనే
తోటలో నా ప్రభువు
పాపి నాకై వి-జ్ఞాపన చేసెడి
ధ్వని వినబడుచున్నది
పాపి నీకై విజ్ఞాపన చేసెడి
ధ్వని వినబడుచున్నది
1
దేహమంతయు నలిగి
శోకము చెందినవాడై
దేవాది దేవుని ఏకైక సుతుడు
పడు వేదనలు నా కొరకే
2
తండ్రి ఈ పాత్ర తొలగున్‌
నీ చిత్తమైన యెడల
ఎట్లయినను నీ చిత్తము చేయుటకు
నన్నప్పగించితివనెను
3
రక్తపు చెమట వలన
మిక్కిలి బాధనొంది
రక్షకుడేసు హృదయము
పగులగ విజ్ఞాపనము చేసెనే
4
ముమ్మారు భూమి మీదపడి
మిక్కిలి వేదనచే మనయేసు
ప్రభువు తానే వేడుకొనెను
పాపుల విమోచన కొరకే
5
ప్రేమామృత వాక్కులచే
ఆదరించెడి ప్రభువు వేదన
సమయమున బాధపరచెడి
వారి కొరకు ప్రార్థన చేసెనే
6
నన్ను తన వలె మార్చెడి
ఈ మహా ప్రేమను తలచి
తలచి హృదయము కరుగగ
సదా కీర్తించెదను

OK