AG 7 సాగిలపడి మ్రొక్కెదము -
Versi Version 1
సాగిలపడి మ్రొక్కెదము -
సత్యముతో ఆత్మలో మన
ప్రభు యేసుని - ఆ....ఆ....ఆ....
1
మోషే కంటె శ్రేష్టుడు - అన్ని
మోసముల నుండి విడిపించున్‌
వేషధారులను ద్వేషించున్‌
ఆశతో మ్రొక్కెదము ||సాగి||
2
అహరోను కంటె శ్రేష్టుడు
మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము ||సాగి||
3
ఆలయము కన్న శ్రేష్టుడు – నిజ
ఆలయముగ తానే యుండెన్‌
ఆలయము మీరే యనెను
ఎల్లకాలము మ్రొక్కెదము ||సాగి||
4
యోనా కంటె శ్రేష్టుడు
ప్రాణదానముగా తన్ను అర్పించెన్‌
మానవులను విమోచించెన్‌
ఘనపరచి మ్రొక్కెదము ||సాగి||
5
సొలోమోను కన్న శ్రేష్టుడు
సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతి ప్రియుండు
పదిలముగా మ్రొక్కెదము ||సాగి||
6
రాజులకంటె శ్రేష్టుడు
యాజకులనుగా మనలను చేసెన్‌
రారాజుగ త్వరలో వచ్చున్‌
రయముగను మ్రొక్కెదము ||సాగి||
7
అందరిలో అతి శ్రేష్టుడు – మన
కందరికి తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు
అనుదినము మ్రొక్కెదము ||సాగి||

OK