AG 58 ప్రభుయేసు నా రక్షకా
Versi Version 1
ప్రభుయేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతమునే నిన్ను జూడ
అల్ఫయు నీవె ఓమేగయు నీవే||ప్రభు||
1
ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసుని స్వరూపము
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియప్రభు నిను జూడనిమ్ము ||ప్రభు||
2
లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడనేనైతిని
చక్క జేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిను జూడనిమ్ము ||ప్రభు||
3
ఎరిగి ఎరిగి నే చెడిపోతిని
యేసు నీ గాయము రేపితిని
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నిను జూడనిమ్ము ||ప్రభు||
4
ఎందరేసునివైపు చూచెదరో
పొందెదరు వెల్గు ముఖమున
సందియంబులేక సంతోషించుచు
ముందుకు పరుగెత్తెదరు ||ప్రభు||
5
విశ్వాస కర్త ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడ యేసు ప్రభూ
వినయముతోనేను నీవైపు జూచుచు
విసుగక పరుగెత్తనేర్పు ||ప్రభు||
6
కంటికి కనబడనివెన్నియో
చెవికివినబడని వెన్నియో హృదయ
గోచరము కాని వెన్నియో
సిద్ధపరచితివా నాకై ||ప్రభు||
7
లోకభోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృప జూపుము
నీ మహిమ దివ్యస్వరూపమును
నిండార నను జూడనిమ్ము ||ప్రభు||

OK