AG 325 స్తోత్రము సేయరే - సోదరులార
Versi Version 1
స్తోత్రము సేయరే - సోదరులార
మన యాత్మలతో దండ్రిన్‌
ధాత్రిని మన పరమాత్ముని వాక్కులు
స్తోత్రములో గలిపి ||స్తోత్రము||
1
ఇచ్చట ప్రేమల కిదియే కడవరి
వచ్చియున్న దేమో అచ్చట
మన మందరము గలిసికొని
యానందింతుముగా ||స్తోత్రము||
2
ఎక్కువ ప్రేమలు-చక్కని స్తోత్రము
లక్కడ మన మంత
మిక్కిలి ప్రియుడగు దేవుని కిడుదము
ఒక్క మనసుతోను ||స్తోత్రము||
3
కన్నీరుండదు-చావు కష్టము
లెన్నటికుండవుగా
కన్నను మన శృంగారపు బ్రతుకు
లెన్న దరముగాదె ||స్తోత్రము||
4
వాగును వీణెలు-సాగును పాటలు
సతతముగా నచట
రాగములెంతో-రమ్యమై యుండును
బాగింతన లేము ||స్తోత్రము||
5
మరల నిచట గూ-డుదమో లేదో
మన మందరము
త్వరలో మన పర-లోకపు దండ్రి
తోడనుందు మేమో ||స్తోత్రము||
6
గొఱ్ఱెపిల్ల రక్తము-విలువచ్చట
గొప్పది గాంతుముగా
గురుతర మగు మన దేవుని ప్రేమను
కూర్మితో జూతుముగా ||స్తోత్రము||
7
పరమ తండ్రితో-ప్రభు యేసునితో
బరిశుద్ధాత్మునితో
స్థిరముగ నుందుము-మరి దూతలతో
బరలోకము నందున్‌ ||స్తోత్రము||

OK