AG 276 రక్షకుండుదయించినాఁడట
Versi Version 1
రక్షకుండుదయించినాఁడట
మన కొరకుఁ బరమ
రక్షకుం డుదయించినాఁడట
రక్షకుం డుదయించినాఁడు
రారె గొల్ల బోయలార
తక్షణమునఁ బోయి
మన ని-రీక్షణ ఫల మొందుదము ||ర||
1
దావీదు వంశమందు
ధన్యుడు జన్మించినాడు
దేవుఁడగు యెహోవా మన
దిక్కుఁదేరి చూచినాడు ||రక్ష||
2
గగనము నుండి డిగ్గి
ఘనుఁడు గబ్రియేలు దూత
తగినట్లు చెప్పె వారికి
మిగుల సంతోష వార్త ||రక్ష||
3
వర్తమానము జెప్పి దూత
వైభవమున పోవుచున్నాడు
కర్తను జూచిన వెనుక
కాంతుము విశ్రమం బప్పుడు ||రక్ష||
4
పశువుల తొట్టిలోన
భాసిల్లు వస్త్రముల జుట్టి
శిశువును కనుగొందురని
శీఘ్రముగను దూత తెల్పె ||రక్ష||
5
అనుచు గొల్ల లొకరి కొక
రానవాలు జెప్పుకొనుచు
అనుమతించి కడకు ఁ క్రీస్తు
నందరికిని దెల్పినారు ||రక్ష||

OK