AG 269 అలలపైనే నడచిన నాదు
Versi Version 1
అలలపైనే నడచిన నాదు
యేసయ్యా నాదు యేసయ్యా
గలిబిలిని నా కలవరములను
తొలగజేసిన కలుషహారుడా
ఆదుకోవయ్యా నాదు యేసయ్యా
1
శుద్ధుడా నీ పిలుపు వింటిని
అద్దరికినే పయనమయితిని (2)
ప్రొద్దుపోయెను భయములాయెను
ఉద్ధరించగా స్వామిరావా ||ఆదు||
2
నట్టనడి సంద్రాన రేగెను
అట్టహాసపు పెనుతుఫాను (2)
గట్టు చూడగా చాలా దూరము
ఇట్టి శ్రమలలో చిక్కుకొంటిని ||ఆదు||
3
అలలు నాపై విసరి కొట్టగా
నావ నిండుగా నీరు చేరెను (2)
బ్రతుకుటెంతో భారమాయెను
రేవు చేరే దారి లేదే ||ఆదు||
4
మాట మాత్రపు సెలవు చేత
సూటిగా అద్భుతములెన్నో (2)
చాలా చేసిన శక్తిమంతుడా
జాలి చూపి మమ్ము బ్రోవుమా ||ఆదు||
5
చిన్న జీవిత నావనాది
నిన్నే గురిగా పయనమయినది (2)
ఎన్నో శోధన లెన్నో భయములు
కన్న తండ్రి కావరావా ||ఆదు||

OK