AG 222 ఓ పాపి ప్రభు చెంతకు రా
Versi Version 1
ఓ పాపి ప్రభు చెంతకు రా
నీ ప్రాపు యేసు ప్రభువేగా ||ఓపాపి||
1
పాపుల వెదకుటకై వచ్చెన్‌
పాపుల రక్షింపను వచ్చెన్‌
పాపంబులకు విలపించగదే ||ఓపాపి||
2
సిలువయె మనమరిగెడుబాట
కలుషంబులు కడిగెడు చోటు
విలువైన ప్రేమ గలదచట ||ఓపాపి||
3
భారము తొలగెడి యా చోటు
నేరము మన్నించెడు చోటు
పరిపూర్ణ విడుదల-గనుమచట||ఓపాపి||
4
కని విని యరుగుము యా చోటున్‌
మనమున దలపోయుము వేగ
ఎనలేని ప్రేమ గలదచట ||ఓపాపి||
5
తన ప్రాణము మనకై బెట్టెన్‌
తన జీవము మనకై నిచ్చెన్‌
మన ప్రాపు యేసు ప్రభువేగా ||ఓపాపి||
6
తన రక్షణ మనకై దెచ్చెన్‌
మన శిక్షను తా భరియించెన్‌
మన ప్రాపు యేసు ప్రభువేగా ||ఓపాపి||

OK