AG 134 1. సన్నుతింతుమో ప్రభో
Versi
Version
1
1
సన్నుతింతుమో ప్రభో
సదమలమగు భక్తితో
కన్నతండ్రి కావుమా
కలుషము నెడబాపుమా
2
నీతిసూర్య తేజమా
జ్యోతిరత్న రాజమా
పాతకజన రక్షకా
పతితపావన నామకా
3
మానవ సంరక్షకా
దీన నిచయ పోషకా
దేవమానవ నందనా
దివ్య సుగుణ మందనా
4
ప్రేమ తత్వబోధకా
క్షేమదాత వీవెగా
కామిత ఫలదాయక
స్వామి యేసు నాయక
5
పాపచింతలన్నిటిన్
పారదోలుమో ప్రభో
నీ పవిత్ర నామమున్
నిరతము స్మరియించెదన్
OK
Terima kasih untuk bantuannya. Link sudah kami terima. Kami akan memprosesnya terlebih dahulu.
© 2010–2025 Tim Alkitab
© 2010–2025 Quick Bible Team